నాది మిర్చిలాంటి పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు చేస్తున్నా మనోజ్‌కు సరైన విజయం ఇంకా దక్కలేదు. స్టార్ హీరో ఇమేజ్ అతనితో దోబూచులాడుతూనే ఉంది. ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న మనోజ్ లేటెస్ట్‌గా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘గుంటూరోడు’తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్‌కే సత్య దర్వకత్వంలో విజిల్స్ అండ్ క్లాప్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 3న విడుదల కానుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విడుదల సందర్భంగా మంచు మనోజ్‌తో ఇంటర్వ్యూ...
గుంటూరోడు ఎలా ఉంటాడు?
నిజానికి ఈ సినిమా ఈనెల 24న విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ అప్పటికే అన్ని థియేటర్లలో మంచి సినిమాలు ఉండటం, మేము అనుకున్న థియేటర్స్ దొరకక పోవడంవల్ల కాస్త ఆగి మార్చి 3న రిలీజ్ చేస్తున్నాం. ఇక ఈ చిత్రంలో నేను పూర్తిస్థాయి మాస్ హీరోగా, సరికొత్తగా కనిపిస్తాను. అన్యాయం జరగడం చూస్తే తట్టుకోలేక ఎవరినైనా ఎదిరించే పాత్ర. సంతోషం కలిగినా, బాధ కలిగినా ఎక్కువ తట్టుకోలేను. మొత్తంగా చెప్పాలంటే గుంటూరు మిర్చీలాగా చాలా హాట్‌గా ఉంటుంది.
ప్రయోగాలు వర్కవుట్ కాలేదు కదా... మళ్లీ చేస్తారా?
ఖచ్చితంగా చేస్తాను. ప్రస్తుతానికి కమర్షియల్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను. నా తరువాత సినిమాలు ప్రయోగాత్మకంగానే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాను. నిజానికి నా కెరీర్‌లో పెద్ద కమర్షియల్ హిట్టయిన ‘పోటుగాడు’ బలవంతంగా చేసిందే. నేను చేసిన వాటిల్లో ఇప్పటికీ నాకిష్టమైనవి ‘ప్రయాణం, వేదం, నేను మీకు తెలుసా’ సినిమాలే. అవి ఇపుడు చూసిన ఫ్రెష్‌గానే ఉంటాయి.
కథల ఎంపికలో ఇతరుల సలహా తీసుకుంటారా?
లేదు. నేను ఎవరి సలహాలు తీసుకోను. ఏదైనా నేనే ఫైనల్ చేస్తాను. అంతేగాని మా నాన్నకు చెప్పు, అన్నకు చెప్పు, మేనేజర్‌కు చెప్పు, పక్కింటోళ్లకు కథ చెప్పమని చెప్పను. ఎవరైనాసరే కథ ఉందని వస్తే నేనే విని, ఫైనల్ డెసిషన్ తీసుకుంటా.
సినిమాకోసం బరువు పెరగడం, తగ్గటం ఎలా అనిపిస్తోంది?
నిజంగా ఇది చాలా కష్టమైన పనే. గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు సినిమాలకి నాకు 8 కేజీల బరువు తేడా ఉంటుంది. ఈ బరువును కేవలం 20 రోజుల్లో తగ్గించుకోగలిగా. బరువు పెరగడం సులభమే కానీ తగ్గటమే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా ఒకసారి అలవాటైతే పర్లేదు చేసేయ్యొచ్చు.
చిరంజీవి వాయిస్ ఓవర్ ఐడియా ఎవరిది?
ఈ సినిమాలో కథను వివరించడానికి ఒక పాపులర్ హీరోతో వాయిస్ ఓవర్ అయితే బాగుంటుందని అనుకున్నా... దానికోసం మొదట చరణ్‌ను అడిగా.. సరే బాబాయ్ చెబుతా అన్నాడు.. కానీ నాకేమో రెండు రోజుల్లో కావాలి. కానీ తాను విదేశాల్లో ఉన్నాడు. రావడానికి పది రోజులు పడుతుంది అన్నాడు. ఇప్పుడు ఎలా అనుకున్న సమయంలో ఓ రోజు చిరంజీవి అంకుల్ ఇంటికి మా ఫ్యామిలీ బ్రేక్ ఫాస్ట్ సమయంలో కలవడానికి వెళుతూంటే నేనుకూడా బయలుదేరా. అప్పుడు చిరంజీవి అంకుల్‌ని గుంటూరోడు సినిమాకు వాయిస్ ఓవర్ కావాలని అడిగా. ఆయన వెంటనే ఎప్పుడు చెప్పాలి అని అన్నా రు.. నిజంగా ఆయన ఇచ్చిన వాయిస్ సినిమాకు మరో హైలెట్ అవుతుంది..

చరణ్‌కు ఈ విషయం చెప్పారా?
ఆ... తరువాత ఈ వాయిస్‌ని చరణ్‌కు పంపించా... వెంటనే తాను పిల్లకోసం వస్తే పులి దొరికిందిగా అన్నాడు.
ప్రగ్యజైస్వాల్ గురించి చెప్పండి?
ప్రగ్యజైస్వాల్ మంచి కో స్టార్. చాలా మంచి నటి కూడా. ఎప్పుడూ హుషారుగా, నవ్వుతూ ఉంటుంది. సెట్లో అల్లరి చేస్తూనే ఉంటాం. మా టీమ్ అంతా ఎప్పుడూ పాజిటివ్‌గానే పనిచేశాం. చిన్నా రీరికార్డింగ్, వసంత్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అవి బాగా హైలైట్ అవుతాయి.
‘ఒక్కడు మిగిలాడు’ ఎప్పుడు?
అది కూడా మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దర్శకుడు అజయ్ చాలా బాగా తీశాడు. చివర్లో వచ్చే వార్ సీన్ అయితే అదిరిపోతుంది. అందులో నేను ఎల్టీటీఈ ప్రభాకరన్ పాత్ర చేశాను. సినిమా మే నెలలో రిలీజవుతుంది. అందులో శ్రీలంకలోని
తమిళులపై జరిగే అన్యాయాలను చూసి ప్రభాకరన్ ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేదే చూపి స్తాం. 1990, 2017లో నడిచే రెండు కథలు ఉంటాయి. తమిళ ప్రేక్షకులకు నచ్చుతుంది.
తమిళంలోకి ఎంట్రీ ఎప్పుడు?
మే నెలనుండి ఒక ద్విభాషా చిత్రాన్ని స్టార్ట్ చేస్తాను. అలాగే ‘గుంటూరోడు’ సినిమాని కూడా తమిళంలోకి రీమేక్ చేద్దామని అనుకుంటున్నాను.
భావన సంఘటనపై మీ స్పందన?
నిజంగా అది చాలా ఘోరం. ఇవొక్కటే కాదు సొసైటీలో ఆడవాళ్లు, చిన్నపిల్లలపై చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అవి చూస్తుంటే కోపమొస్తుంటుంది. నాయాళ్లను నరికేయాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాగైనా వాటిపై పోరాడాలనిపిస్తుంది. అందుకే ఈ అంశం మీద త్వరలోనే ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్టోరీ రెడీ అవుతోంది.

- శ్రీ