నిఖిల్ కేశవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, రీతూవర్మ జంటగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘కేశవ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ- మరో పది రోజుల్లో అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని, టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్‌ను ఈ చిత్రం తీసుకువస్తుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవిలో మే 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సుధీర్‌వర్మ, తాను స్నేహితులుగా మెలుగుతున్నామని, తమ ఇద్దరి కెరీర్‌కు ఈ చిత్రం ప్లస్ కానుందని, అతని టేకింగ్ ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటుందని హీరో నిఖిల్ తెలిపారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే ఓ కొత్త కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలవారికి నచ్చే అంశాలతో రూపొందిందని దర్శకుడు సుధీర్‌వర్మ అన్నారు. ఇషాకొప్పీకర్, రావురమేష్, అజయ్, బ్రహ్మాజీ, ప్రియదర్శి, రాజారవీంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:దివాకర్ మణి, సంగీతం:సన్నీ యం.ఆర్., నిర్మాత:అభిషేక్ నామా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సుధీర్‌వర్మ.