విశ్వదేవ్ చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వదేవ్ రాచకొండ, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా అమేజింగ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ డైరెక్టర్ కోటి క్లాప్ కొట్టగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి చంద్రబోస్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ, ‘డైరెక్టర్ ప్రదీప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకు పరిచయం ఉంది. మంచి మ్యూజిక్ అందించే ప్రదీప్, ఇప్పుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. దర్శకత్వంలో కూడా ప్రదీప్ తనేంటో ప్రూవ్ చేసుకుంటాడనే నమ్మకం ఉంది’ అన్నారు. దర్శకుడు ప్రదీప్.కె.కె మాట్లాడుతూ- ‘క్లీన్ అండ్ క్యూట్ లవ్‌స్టోరీ. పిట్టగోడ హీరో విశ్వదేవ్ రాచకొండ ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఆనందంగా వుంది. సినిమాలో ఐదు పాటలుంటాయి. గురువారం నుంచి ఫస్ట్‌షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. ఒక ఎన్నారై అబ్బాయి, ఇండియన్ అమ్మాయి మధ్య నడిచే క్యూట్ లవ్‌స్టోరీ. తప్పకుండా ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాం’ అన్నారు. రావురమేష్, గౌతంరాజు, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్రఫి:శేఖర్.వి.జె, ఆర్ట్:నాగు.వై, ఎడిటర్:ఉపేందర్, పాటలు:చంద్రబోస్, శ్రీమణి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి:డి.ఆర్.వెంకట్, నిర్మాత:అమేజింగ్ టీమ్, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం:ప్రదీప్.కె.కె.