మనిద్దరిమధ్య 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంకార్తీక్, భాను త్రిపాఠి జంటగా ఎస్.ఆర్.పి. విజువల్స్ పతాకంపై నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌పాటిల్ రూపొందించిన చిత్రం ‘ఇద్దరిమధ్య 18’. బిత్తిరి సత్తి ఓ కీలకమైన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను తెలంగాణ మంత్రి టి.హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- రాజకీయాలలో అనుభవం వున్న శివరాజ్‌పాటిల్ సినిమా రంగంలో కూడా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కమర్షియల్ హంగులతో యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో ఓ మంచి సందేశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత శివరాజ్‌పాటిల్ తెలిపారు. కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు, జీవిత, ఎన్.శంకర్, మల్కాపురం శివకుమార్, రాంకార్తీక్, బిత్తిరి సత్తి, జి.ఎల్.బాబు, ఘంటాడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.