చివరి దశలో రోబో 2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీకాంత్, శంకర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుత్నున చిత్రం ‘రోబో 2.0’. 2010లో రిలీజైన భారీ బ్లాక్‌బస్టర్ ‘రోబో’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో చాలా గ్రాండ్‌గా నిర్మిస్తోంది. కొద్దిరోజుల క్రితమే మొదలైన ఈ చిత్రం యొక్క ఆఖరి షెడ్యూల్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ ఆఖరి దశ షూట్లో రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అక్షయ్ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్స్, వి.ఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకపోతే చిత్రంయొక్క టీజర్ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసి చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు దర్శక నిర్మాతలు.