డోర పాటలొస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో నటిస్తున్న చిత్రం ‘డోరా’. దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయి ఈ నెల 7న పాటలు విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- విభిన్న కథ, కథనాలతో తెరకెక్కుతున్న హర్రర్ చిత్రమిది. నయనతారకు ఎలాంటి క్రేజ్ వుందో అందరికీ తెలుసు. ఆ క్రేజ్‌వల్ల ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారమే ఈ చిత్రం. అసలు డోరా ఏమిటి? ఆ పేరు వెనుకనున్న రహస్యమేమిటా అనేది తెరపై ఉత్కంఠతను పెంచుతుంది. ప్రతి సన్నివేశం థ్రిల్‌కు గురిచేస్తుంది. నయనతార పాత్ర కొత్తగా వుంది. అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 7న పాటలను విడుదల చేసి త్వరలోనే తమిళ, తెలుగు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:వివేక్, కెమెరా:దినేష్, నిర్మాత:మల్కాపురం శివకుమార్, దర్శకత్వం:దాస్.