17న నేనోరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరామ్‌శంకర్ కథానాయకుడిగా శరత్‌కుమార్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నేనోరకం’. రేష్మీమీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్‌రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను పూరి జగన్నాథ్, దేవిశ్రీప్రసాద్, గోపీచంద్, శర్వానంద్ ఒక్కొక్కరు ఒక్కొక్క పాటను త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో సాయిరామ్‌శంకర్ మాట్లాడుతూ ఈ కథకు ‘నేనోరకం’ అనే పేరు కచ్చితంగా సరిపోతుందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న విషయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆలోచింపచేసేలా సినిమాని రూపొందించారని, థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. దర్శకుడి కథాకథనమే ఈ సినిమాకు హైలైట్ అని, ఓ మంచి సినిమాగా విడుదలయ్యాక అందరూ మెచ్చుకుంటారని నటుడు శరత్‌కుమార్ అన్నారు. త్వరలో టాప్ సెలబ్రిటీస్ ఆడియోను విడుదల చేయనున్నారని, సాయిరామ్‌శంకర్, శరత్‌కుమార్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయని, థ్రిల్ కలిగిస్తాయని దర్శకుడు సుదర్శన్ తెలిపారు. సరికొత్త కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాను క్రిటిక్స్ కూడా మెచ్చుకుంటారని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆదిత్యమీనన్, కాశీవిశ్వనాథ్, పృథ్వి, వైవాహర్ష, జబర్దస్త్ బృందం, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్థ్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్, దర్శకత్వం: సుదర్శన్ సలేంద్ర.