రీల్ లైఫ్‌లో రొమాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్యారాయ్ ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆమె మళ్లీ తన భర్తతో కలిసి రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది? ఇప్పటికే ధూమ్-2, గురు, రావణ్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు మరోసారి తెరపై రొమాన్స్‌కు రెడీ అయ్యారు. లేటెస్టుగా వీరిద్దరూ కలిసి ‘గులాబ్‌జామూన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ అని తెలిసింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఇక రియల్ లైఫ్‌లో భార్యాభర్తలైన ఈ జంట ఇప్పుడు తెరపై రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యారని, మరి వీరిద్దరూ కలిసి నటించే ఈ సినిమా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.