ముంబైలో బాహుబలి 2 ట్రైలర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రమక్రమంగా ‘బాహుబలి-2’ చిత్రంకోసం రాజవౌళి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని పోస్టర్‌లను విడుదలచేసిన రాజవౌళి త్వరలో ఆడియో వేడుకని కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి-2 చిత్రం ట్రైలర్‌ని ముంబై వేదికగా ఈనెల 15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రభాస్, రానా, రాజవౌళి, తమన్నా, అనుష్కలు పాల్గొననున్నారు. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ చిత్రంకోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు. తారాస్థాయిలో అంచనాలు ఉన్న చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా అదే స్థాయిలో అంచనాలు పెంచేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.