డోరగా నయనతార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘డోర’. దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియాలో మంచి నటిగా పేరున్న నయనతార నటన ఆకట్టుకునేలా ఉంటుందని, తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. తమ సంస్థనుండి విడుదలైన సింగం-3 తర్వాత మరో మంచి చిత్రం డోర అని ఆయన అన్నారు. కారుతో లింక్ అయిన హారర్ కథతో వైవిధ్యంగా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, ఈనెల 31న తెలుగు, తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు దాస్ తెలిపారు. కార్యక్రమంలో ఎన్.శంకర్, చంద్రబోస్, వివేక్, మెరిన్ తదితరులు విశేషాలను తెలిపారు.