102వ చిత్రం కోసం బాలయ్య కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో మంచి విజయాన్ని అందుకుని 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు నందమూరి బాలకృష్ణ. ఇక ఆయన 101వ చిత్రంగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురువారం ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత తన 102వ సినిమా కోసం అప్పుడే సన్నాహాల్లో జోరు పెంచాడు బాలకృష్ణ. ఈ సినిమా కోసం ముగ్గురు దర్శకులు క్యూలో వుండడం విశేషం. ఇప్పటికే కృష్ణవంశి దర్శకత్వంలో ‘రైతు’ సినిమా కోసం కసరత్తులు కూడా జరిగాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అమితాబ్ నటిస్తే, తాను సినిమా చేయడానికి సిద్ధమేనని చెప్పాడు బాలకృష్ణ. ఆ దిశగా ప్రయత్నాలు జరిగి అమితాబ్‌ను ఒప్పించే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. అమితాబ్ కూడా కథ విని ఓకె చెప్పే సూచనలు ఉన్నాయట. దాంతోపాటు ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కూడా ఓ పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ కథను వినిపించాడట. బాలయ్య కెరీర్‌లో పక్కా కమర్షియల్ అంశాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు రవికుమార్ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ కెరీర్‌లో సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు బోయపాటి శీను కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న ఆయన మరోసారి బాలయ్యతో సినిమా చేయడానికి కథ కసరత్తులు చేస్తున్నారట. సింహ, లెజెండ్ వంటి ఘనవిజయాల తరువాత హ్యాట్రిక్ హిట్ కోసం బోయపాటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ ముగ్గురి దర్శకుల్లో బాలయ్య ఎవరికి ఓటేస్తాడో చూడాలి.