రాజుగారి గది భయపెడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకూ గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ సమంత, ఈసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమైంది. లేటెస్టుగా ఈ షాకింగ్ న్యూస్ బైటికి రావడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఈమధ్య దక్షిణాదిలో హారర్ చిత్రాల హవా ఎక్కువ అవడంతో ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు హీరోయిన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోకి సమంత కూడా చేరింది. ఆ వివరాల్లోకి వెళితే, ఈమధ్యే వచ్చిన ‘రాజుగారి గది’ మంచి విజయం సాధించడంతో, దానికి సీక్వెల్‌గా ‘రాజుగారి గది-2’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కీలకపాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత ఘోస్ట్ పాత్రలో కన్పిస్తుందని టాక్. ఇందులో కూడా రెండు షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ చిత్రంలో అశ్విన్‌తోపాటు సీరత్‌కపూర్ నటిస్తోంది. ప్రతీకారం కోసం ఎదురుచూసే ఓ ప్రేతాత్మ ఓ మహల్‌లో ఉంటుందని, ఈ నేపథ్యంలో కథ ట్విస్ట్‌లపై సాగుతుందని సమాచారం. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న సమంత మరి ఈసారి ఘోస్ట్‌గా ఎలా భయపెడుతుందో చూడాలి.