మలయాళ రీమేక్‌లో అల్లరి నరేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్ కాబోతోంది. జాహ్నవి ఫిలిం బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి.ప్రజీత్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరెకక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠను రేకెత్తించే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించనుంది. ఈనెల (మార్చి)16నుండి ఏప్రిల్ 5 వరకు పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం ఏప్రిల్ 16 నుండి తదుపరి షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లో జరుపుకోనుంది. నిఖిల విమల్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలో నటించనున్నారు. అల్లరి నరేష్ నిఖిల విమల, అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది, జయప్రకాశ్, జీవా, పద్మా జయంతి, తులసి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఉన్ని ఎస్.కుమార్, ఎడిటర్:నందమూరి హరి, మ్యూజిక్:డి.జె.వసంత్, ఆర్ట్:రాజీవ్ నాయర్, డైలాగ్స్:పిల్లజమీందార్ అశోక్, నిర్మాత:చంద్రశేఖర్ బొప్పన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.ప్రజీత్.