అమ్మమ్మగారి ఇంట్లో నాగశౌర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చందమామ కథలు’ చిత్రంతో వెండితెరపైకి వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుని నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘కళ్యాణ వైభోగమే’ వంటి సినిమాలు ఫర్వాలేదనిపించుకోగా, చివరి చిత్రాలు ‘జో అచ్యుతానంద’ మంచి విజయం సాధిస్తే, ‘నీ జతలేక’ పరాజయం పొందింది. ఇక ఆ తర్వాత బలమైన స్క్రిప్ట్‌కోసం కాస్త ఎక్కువ సమయమే కేటాయించిన నాగశౌర్య ఒక సినిమాని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆ చిత్రానికి ‘అమ్మమ్మగారి ఇల్లు’ అనే ఆసక్తికరమైన వెరైటీ టైటిల్‌ను పెట్టారు. ఈ టైటిల్ చూస్తుంటే సినిమా మంచి రొమాంటిక్ కంటెంట్‌తో కూడిన పూర్తి కుటుంబ కథా చిత్రంగా ఉండనుందని ఇట్టే అర్థమవుతోంది. ఇకపోతే కళ్యాణరమణ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు, హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరు, ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు ఇంకా విడుదల కాలేదు.