అందరికీ నచ్చే మా అబ్బాయి - నిర్మాత బలగ ప్రకాశరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు మా అబ్బాయి అనే మాటను తరచూ వాడుతుంటారు. మనం కూడా వింటూనే ఉంటాం. అలాంటి సాధారణ అబ్బాయి కధే ‘మా అబ్బాయి’ అని నిర్మాత బలగా ప్రకాశరావు తెలిపారు. శ్రీవిష్ణు, చిత్రశుక్ల జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో వెనె్నల క్రియేషన్స్ పతాకంపై ఆయన రూపొందించిన చిత్రం ‘మా అబ్బాయి’ ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత పలు విశేషాలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- తమ సంస్థ ద్వారా తొలి సినిమాగా వస్తున్న ఈ చిత్రం కథ అద్భుతంగా ఉంటుందని, పూర్తి కాన్ఫిడెన్స్ వున్న ఓ కుర్రాడి కథతో దిల్‌షుక్‌నగర్ బాంబుదాడుల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలిపారు. యాక్షన్ పార్ట్ కూడా కథలో భాగంగానే వస్తుందని, తన కుటుంబానికివచ్చిన సమస్యను, తన ప్రియురాలికి ఎదురైన ఇబ్బందులను హీరో ఎలా పరిష్కరించాడు అనే కథనంతో ఈ సినిమా సాగిందని ఆయన తెలిపారు. రెగ్యులర్ కమర్షియల్‌గా వుంటూనే స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగుతుందని, యధార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు మంచి కథను సిద్ధం చేశాడని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని ఆయన అన్నారు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నానని ఆయన వివరించారు.