కష్టమంతా బూడిదైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మావతి చిత్రంలో నటించే జూనియర్, సీనియర్ నటులకోసం నెలల తరబడి కష్టపడి రూపొందించిన దుస్తులన్నీ దగ్ధమై బూడిదగా మిగిలిపోయాయని డిజైనర్లు రింపిల్, హర్‌ప్రీత్ నరులా ఆవేదన వ్యక్తం చేశారు. అల్లరిమూకలు వచ్చి సెట్‌కు నిప్పుపెట్టాయని, దాదాపు జూనియర్ నటులకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఒక్కటీ మిగలలేదని, సీనియర్ల దుస్తుల సంగతి చూడాలని వారన్నారు. ఈ సంఘటన తమకు షాక్ కలిగించిందని, ఇలా జరుగుతుందని తామెప్పుడూ ఊహించలేదని వారన్నారు. అక్షరాస్యత లేకపోవడంవల్ల దురదృష్టవశాత్తు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, పద్మావతి చిత్రంలో ఎటువంటి వక్రీకరణ లేదని ఎన్నిసార్లు చెబుతున్నా నమ్మరెందుకని వారు అన్నారు. ఈ సంఘటనతో క్రియేటివిటీ చచ్చిపోయిందని, ఆర్థికంగా పెద్దనష్టమేనని, మళ్లీ ఇవన్నీ రూపొందించడానికి మరెంతో సమయం వృధా అవుతుందని వారు అన్నారు.