తొలికిరణం ఆడియోకు ఆదరణ దర్శకుడు జాన్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువర్ణ క్రియేషన్స్ పతకంపై పి.డి. రాజు, అభినయ, భానుచందర్, సాయికిరణ్ ముఖ్యపాత్రల్లో జె.జాన్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తొలికిరణం’. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా చిత్ర దర్శకుడు జాన్‌బాబు చిత్ర విశేషాలు తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఆర్.పి.పట్నాక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా నెల రోజుల్లో యాభై లక్షల సీడీలు అమ్ముడవడం విశేషం. అద్భుతమైన పాటలను పట్నాయక్ అందించారు. యేసు ప్రభువుపై చాలా సినిమాలు వచ్చాయి కానీ, ఈ పాయింట్‌ను ఎవరు టచ్ చేయలేదు. యేసుక్రీస్తు మరణించి మూడో రోజు లేచిన తరువాత భూమిమీద దాదాపు 40 రోజులు ఉన్నా డు.. అప్పుడు ఆయన ఏం చేశాడు, అసలు ఆ నలభై రోజులు ఏమి జరిగింది అనే పాయింట్‌ను చర్చిస్తూ ఈ సినిమా తీస్తున్నాం. ఇప్పటికే షూటింగ్‌ని హైదరాబాద్, ఇజ్రాయిల్ తదితర ప్రాంతాల్లో జరిపాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని గుడ్‌ఫ్రైడే సందర్భంగా అంటే ఏప్రిల్ 17న విడుదల చేస్తాం’ అని అన్నారు.