మాస్‌కు నచ్చే పాటల రాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్, శృతిహాసన్ జంటగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 24న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఇటీవల అనూప్ సంగీత దర్శకత్వంలో విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, ప్రతి పాటకు ఆడియెన్స్ అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ‘జివ్వు జివ్వు’ అనే పాట అందరికీ నచ్చేలా సాగిందని, ప్రేక్షకులకు నచ్చేలా మాస్ ఫోక్ సాంగ్‌గా చిత్రీకరించామని తెలిపారు. ‘మిరా మిరా మీసం’ పాటకు నాలుగు మిలియన్ల వ్యూస్, రెండు లక్షల లైక్స్ వచ్చాయని, సినిమా విడుదలయ్యాక పాటలకన్నా ఎక్కువగా హిట్ అవుతుందన్న నమ్మకం వుందని వారు తెలిపారు. కాటమరాయుడు పాటలు తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశంలో విడుదలయే కేంద్రాల్లో లభ్యమవుతాయని, అభిమానులను దృష్టిలో పెట్టుకుని అందుబటు ధరలో ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, నిర్మాత:శరత్ మరార్, దర్శకత్వం:కిశోర్ పార్థాసాని.