భారీ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసిన ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలబడింది అందాల భామ కీర్తి సురేష్. రామ్ హీరోగా వచ్చిన ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఆ తరువాత లేటెస్టుగా ‘నేను లోకల్’ అంటూ మరో ఘనవిజయాన్ని అందుకున్న కీర్తికి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ ఫేవరేట్ అయింది. ఇప్పటికే ఆమెతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు చేస్తున్న ఈ భామ, లేటెస్టుగా ఓ భారీ ఆఫర్‌ను తెలుగులో కొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందట. ప్రస్తుతం శ్రీనివాస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. నిజానికి కీర్తి ఈ సినిమా కోసం కాల్షీట్లను కేటాయించలేకపోయింది. కానీ నిర్మాత ఇచ్చిన భారీ ఆఫర్‌తో ఓకె చెప్పినట్లు తెలిసింది. మరోవైపు స్టార్ హీరోలు సైతం ఈమెకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే అందర్నీ కాదని ఇలా కుర్ర హీరోతో జోడీ కట్టడానికి ఓకె చెప్పడం టాలీవుడ్‌లో షాకిస్తోంది. మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్ భారీ ఆఫర్లతో క్రేజీ హీరోయిన్లను పడగొట్టడం ఆసక్తిగా మారింది.