అభినేత్రిపై ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్కీ భామ తమన్నా ఫోకస్ ఈమధ్య బాలీవుడ్‌పై పడింది. సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న తమన్నా హిందీలో సైతం స్టార్‌గా రాణించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా హిందీలో మరో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు ఈమధ్యే ఎన్నో ఆశలు పెట్టుకుని తెలుగులో చేసిన ‘అభినేత్రి’ చిత్రం భారీ పరాజయాన్ని అందుకోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రభుదేవ. చాలా కాలం తర్వాత ప్రభుదేవ సౌత్‌లో చేసిన సినిమా ఇది. సినిమా ప్లాప్ అయినా కూడా దీన్ని సీక్వెల్ చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. దానికి కారణం మళ్లీ తమన్నాతో ఈ సినిమా హిట్ చేసేలా రూపొందిస్తారట. ఈ సినిమాకోసం తమన్నా చాలానే కష్టపడింది. ‘డెవిల్-2’ పేరుతో రూపొందే ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈమధ్యే తమన్నా ప్రభుదేవతో ఎక్కువగా కాలక్షేపం చేస్తోందని, ఈమెను బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి వ్యవహారంపై కోలీవుడ్‌లో గుసగుసలు ఎక్కువయ్యాయి.