ఆచారి అమెరికా యాత్ర మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణు, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తిచౌదరి, కిట్టు నిర్మిస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ఆదివారం తిరుపతిలో ప్రారంభమైంది. మంచు విష్ణు, బ్రహ్మానందంలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మాజీ కేంద్రమంత్రి సుబ్బిరామిరెడ్డి క్లాప్‌నివ్వగా రాజకీయవేత్త రఘురామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. మల్లాది వెంకటకృష్ణమూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథను అందించారని, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరుగుతుందని, మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, మాటలు: డార్లింగ్ స్వామి, స్క్రీన్‌ప్లే: విక్రమ్‌రాజ్, నివాస్ వర్మ, సమర్పణ: ఎం.ఎల్.కుమార్‌చౌదరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.