అందంగా లేనన్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామరస్ హీరోయిన్ అని టాలీవుడ్‌లో ముద్రపడిన తాప్సిని కూడా డీగ్లామర్ హీరోయిన్ అని అన్నారట! ఎవరైనా ఇది వింటే నమ్ముతారా? కట్ చేస్తే, తాప్సి కేవలం స్కిన్ షోలకే పరిమితమైన నటి అని, ఆమెకు నటించే సత్తా లేదని టాలీవుడ్‌లో ముద్రవేయడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ ఆమె నటించిన ‘పింక్’ చిత్రంతో ఒక్కసారిగా మంచి నటిగా గుర్తింపు పొందింది. టాలీవుడ్‌లో తనలో వున్న నటిని గుర్తించలేదని, అవకాశాలు తగ్గిన హీరోయిన్‌కు ఎన్ని కష్టాలుంటాయో అన్నీ తాను ఎదుర్కొన్నానని, ఐరెన్‌లెగ్ ముద్ర వేశారని చెప్పుకొచ్చింది తాప్సి. హీరోని డైరెక్టర్లను వదిలేసి సినిమా ఫట్ అయితే తన ఖాతాలో వేసేవారని బాధపడింది. పారితోషికం తగ్గించుకోమని చెప్పారని, ఓకె అనేలోగానే మరో నటిని ఎంపిక చేసుకునేవారని, టాప్ హీరోలు కూడా తనతో చేయడానికి ఇష్టపడలేదని అంటోంది. తన డేట్స్ తీసుకుని మరో పెద్ద హీరోయిన్ దొరికిందని తప్పించేసేవారని, మినిమమ్ రెమ్యూనరేషన్ కూడా పోరాడాల్సిన పరిస్థితి ఒకానొక టైమ్‌లో ఎదుర్కొన్నానని చెబుతోంది. అయితే ఇదంతా ఓకె, కానీ తాను అందగత్తెను కాను అంటే మాత్రం ఒప్పుకోనంటోంది. నటన అంటే ఇష్టంతో, నా టాలెంట్‌పై నమ్మకంతో వచ్చానే కానీ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని చెబుతోంది. ఇన్ని విషయాలు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన తాప్సికి బాలీవుడ్ వెళ్లాకే ఇంత ధైర్యం వచ్చినట్లుగా కనిపిస్తోంది!