కొత్త కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలపై గురిపెట్టింది. బాలీవుడ్‌లో సెటిల్ అవుదామనుకున్న ఈ అమ్మడుకు ‘తుటియా తుటియా తుటక్’ చిత్రం సరైన అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనకు ప్రభుదేవా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలై సో..సోగా ఆడిన ‘అభినేత్రి’ చిత్రం ఫర్వాలేదనిపించింది. అయితే ఇదే ధైర్యంతో ప్రభుదేవా కేవలం తమన్నా కోసమే సీక్వెల్ రూపొందించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రెండు మూడు ప్రేమాయణాలతో విసిగెత్తిపోయిన ప్రభుదేవా, ప్రస్తుతం తమన్నాతో ప్రేమాయణం జరుపుతున్నాడని కోలీవుడ్ కోడై కూస్తోంది. దానికితోడు తమన్నాను బాలీవుడ్‌లో స్టార్‌ను చేయాలని ప్రభుదేవా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ విషయం ఆ నోట ఈనోట తమన్నాకు చేరింది. ఇక ఆమె ఎలా స్పందిస్తుంది అనేది తెలియాల్సి వుంది!