ముందు జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విజయంతో కథానాయిక సురభి మంచి ఊపుమీదుంది. ఒక్క హిట్ కూడా పలకరించని హీరోయిన్ల లిస్టులోనుండి ఒక్కసారిగా హిట్ హీరోయిన్‌గా ఎదిగింది. గతంలో ‘బీరువా’ చిత్రంతో తెరంగేట్రం అయిన సురభి ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వకపోవడంతో వెనకబడిపోయింది. చాలా రోజులు కనబడలేదు. ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ హిట్టవ్వడంతో మరిన్ని అవకాశాల వేటలో ఉన్నది సురభి. ఇదంతా ప్రస్తుతం. గతంలో హీరోయిన్‌గా నటించినా తన స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఈ విషయం చెప్పలేదట. ఇప్పుడు సినిమా హిట్టయ్యాక తాను హీరోయిన్‌గా నటిస్తున్నానని, తాను చేసిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ సినిమా విజయవంతమైందని చెబుతోందట. ఇన్నాళ్లు నువ్వు హీరోయిన్‌గా చేస్తున్నావన్న విషయమే మాకు తెలియదు. ఎలా దాచావు అని అడిగితే ముందు జాగ్రత్తగా దాచానందట! ఒకవేళ సినిమా ఫట్ అయితే ఏమని చెప్పుకోవాలి? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇప్పుడు సినిమా హిట్ అయింది కనుక తాను కథానాయికగా నటించానని వివరణ ఇచ్చింది.