13న మిస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ ఏప్రిల్ 13న విడుదలవుతోంది. లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బేబి భవ్య సమర్పిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియో సెట్‌లో ఓ పాటను చిత్రీకరించారు. ఇంకో పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ పాటను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇటలీలో తెరకెక్కించనున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ- మా ‘మిస్టర్’ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నాం. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డైరెక్టర్‌గా మిస్టర్ వంటి కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూశాను. చక్కటి భావోద్వేగాలకు, కడుపుబ్బ నవ్వుకునే వినోదానికి, వినసొంపైన సంగీతానికి, కనువిందు చేసే దృశ్యాలకు అనువుగా వున్న కథ ఇది. ట్రావెల్ ఫిల్మ్ తరహాలో సాగుతుంది ‘మిస్టర్’. స్పెయిన్‌లోని పలు అద్భుతమైన లొకేషన్‌లలో షూట్ చేశాం. అలాగే ఇండియాలో చిక్‌మంగళూర్, చాళకుడి, ఊటీ, హైదరాబాద్ ఏరియాల్లో ఒరిజినల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ఇటీవల అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో ఓ సెట్‌లో సాంగ్ చేశాం. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇటలీలో తెరకెక్కించే పాటతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. మిక్కి జె.మేయర్ ఆరు పాటలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఏప్రిల్ మొదటివారంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం’’ అన్నారు. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్, ప్రిన్స్, నాజర్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీ్ధర్ సీపాన, సంగీతం: మిక్కి జె మేయర్, సినిమాటోగ్రఫి: కె.వి.గుహన్, పాటలు: కె.కె, రామజోగయ్య శాస్ర్తీ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.