7న జీవా-కాజల్ ఎంతవరకు ఈ ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా-కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కవలై వేండాం’ తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో అనువాదమవుతున్న సంగతి తెలిసిందే. డికే దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 7న రిలీజవుతోంది. ఈ సందర్భంగా... డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు ‘రంగం’ వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. అన్ని పనులు పూర్తిచేశాం. ఈ నెల 7న సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ‘రంగం’ చిత్రాన్ని తమిళంలో నిర్మించిన ఎల్రెడ్‌కుమార్ ఈ సినిమాను తమిళంలో నిర్మించి రిలీజ్ చేశారు. అక్కడ పెద్ద విజయం అందుకుని ఇప్పుడు తెలుగులో వస్తోంది. తెలుగు ట్రైలర్స్, పాటలు ఆకట్టుకున్నాయి. జీవా, కాజల్ నటన యువతరానికి క్రేజీగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుల్ని వంద శాతం మెప్పించే చిత్రమిది.’ అన్నారు. బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.