రెగ్యులర్ షూటింగ్‌లో పవన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్- త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం రెగ్యులర్ షూట్ నిన్ననే మొదలైంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ప్రత్యేక కాఫీ షాప్ సెట్లో చిత్రీకరణ స్టార్ట్ చేశారు. ఇందులో పవన్, అను ఇమ్మాన్యుయేల్‌ల మీద మొదటి షాట్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ సుమారు నెలరోజులపాటు హైదరాబాద్‌లోనే జరగనుంది. కాగా మొదటి హీరోయిన్ కీర్తిసురేష్ కూడా ఈ వారంలోనే షూట్‌లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ మునుపెన్నడూ లేని విధంగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ లుక్‌లో కనిపించనున్నాడు. పవన్-త్రివిక్రమ్‌ల కలయికలో గతంలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలు మంచి హిట్లుకావడంతో ఈ సినిమాపై కూడా తారాస్థాయి అంచనాలున్నాయి. అనిరుధ్ సంగీతం అందివ్వనున్న ఈ సినిమాను ఆగస్టు కల్లా పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు త్రివిక్రమ్. ఇకపోతే ఈ చిత్రంలో అలనాటి స్టార్ హీరోయిన్ కుష్బు ఒక కీలకపాత్రలో నటించనుండటం విశేషం.