ఆ క్రెడిట్ అంతా ఆయనదే.. అతిథిరావు హైదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం ‘చెలియా’ ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అతిథిరావు హైదరీ ఇంటర్వ్యూ...
కల నిజమైంది...
- మణిరత్నంతో పనిచేయడం ఇబ్బంది కాదు.. ఓ కల నిజమైనట్లుగా భావిస్తున్నాను. అయినా ఛాలెంజింగ్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేము. మణిరత్నం వంటి దర్శకులతో పనిచేసేటప్పుడు మన లిమిట్స్‌ను దాటేలా నటనను ఆయన మననుండి రాబట్టుకుంటారు. అలాగే ఆయన నటుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను, స్పేస్‌ను ఇస్తారు. ఆయనతో కలిసి పనిచేయడంవల్ల ఓ కొత్త క్యారెక్టర్‌ను మనకు మనముగా కనుగొనే అవకాశం ఏర్పడుతుంది.
సినిమాకు హద్దులు లేవు...
- నాకు తెలిసి సినిమాకు ఏ భాషా, ప్రాంతం వంటి హద్దులులేవు. మణిరత్నం వంటి గ్రేట్ డైరెక్టర్ గ్రేట్ స్క్రిప్ట్‌తో సినిమా చేస్తున్నప్పుడు అది ఎక్కడి సినిమానో అని చూడకూడదు. అన్నీ భాషల్లో నటించే నటీనటులు గొప్ప అదృష్టవంతులని నేను భావిస్తాను.
కార్తీతో వర్క్ చేయడం
- కార్తీ వంటి కో-స్టార్‌తో పనిచేయడంవల్ల మనకు కూడా నటించడం చాలా సులువు అవుతుంది.
క్రెడిట్ అంతా ఆయనదే...
- సుహాసిని ఆడియో వేడుకలో చేసిన అప్రిసియేషన్ క్రెడిట్ అంతా మణిరత్నంకే చెందుతుంది. నేను సినిమాలో ఏది చేసినా ఆయన చలవే. మణిగారి దర్శకత్వంలో సినిమా చేశాననడం ఈ రోజుకు కూడా కల లాగానే ఉంది.
తదుపరి చిత్రాలు...
- సంజయ్‌దత్‌తో ‘్భమి’ సినిమా చేస్తున్నాను. అలాగే పద్మావతి మూవీలో నటిస్తున్నాను.