నేడే టిఎస్‌ఆర్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీఎస్సార్ - టీవీ నేషనల్ ఫిల్మ్ అవార్డులను గురువారం ఉదయం హైదరాబాద్‌లో ప్రకటించారు. 2015-16కు గాను ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. 30 రోజుల ప్రక్రియ పూర్తయింది. 2015-16కు గాను అవార్డులను ప్రకటిస్తున్నాం. విశాఖపట్టణంలో జరిగే వేదికపై ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తాం. దాదాపు 50వేల మంది ఒకేసారి వీక్షించేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ అవార్డుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి మా కమిటీ సభ్యులు కొంతమందిని ఎంపిక చేయగా అందులో నుంచి ప్రేక్షకులు ఎంపిక చేసినవి, మరొకటి ప్రేక్షకులే మాకు సూచించినవి. అలాంటి వాటిని జ్యురీ అవార్డుల కింద ఇస్తున్నాము. ఈ అవార్డుల వేడుకకు హాజరయ్యేవారు చాలా ఆనందంతో ఉంటే ఆ పాజిటివిటీని నేను గర్విస్తుంటాను. కళలను పోషించడం, ప్రశంసించడం నాకు చాలా ఇష్టం. ఈ వేడుక ఈ నెల 8న వైజాగ్‌లో జరగనుంది. టీవీ 9తో పాటు మిగిలిన అన్ని ఛానల్స్‌కు కూడా అరగంట తేడాతో మా కార్యక్రమాన్ని ప్రసారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం’ అని అన్నారు. పింకిరెడ్డి మాట్లాడుతూ 50వేల మందిని ఒకచోట చూడటం అనే ఫీలింగ్ చాలా బావుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బి.గోపాల్, రఘురామ కృష్ణంరాజు, టీవీ 9 విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.