ఖయ్యుమ్ భాయ్ టీజర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీసాయి ఊహా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఖయ్యూంభాయ్’. కట్టా శారద చౌదరి నిర్మాత. నరుూమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నందమూరి తారకరత్న ఇందులో ఏసీపీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. కట్టా రాంబాబు, నందమూరి తారకరత్న, ప్రియ, హర్షిత, చలపతిరావు, సుమన్, జీవా, బెనర్జీ, చిన్నా, ఎల్బీశ్రీరామ్, రామ్‌జగన్, జూ.రేలంగి, శేషు, బాహుబలి సోఫియా, పల్నాడు శ్రీను, కాకమాను శ్రీనివాస్, ఎస్వీఆర్ రాంబాబు, మాధవి కీలక పాత్రధారులు, గురువారం హైదరాబాద్‌లో జరిగిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు సాగర్, కృష్ణంరాజు సతీమణి శ్యామల, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ నాగభూషణం సంయుక్తంగా టీజర్‌ను ఆవిష్కరించారు.
నిర్మాత మాట్లాడుతూ.. ‘రియల్ ఇన్సిడెంట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘మే రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కట్టా రాంబాబు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. యాక్షన్ బేస్డ్ సినిమా ఇది అని అన్నారు. రాంబాబు మాట్లాడుతూ.. ‘కథ వినగానే నచ్చి చేశాను. ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదు’ అని చెప్పారు. ఈ సినిమాకు సంగీతం: శేఖర్‌చందర్, ఎడిటింగ్: గౌతంరాజు, కెమెరా: శ్రీ్ధర్ నారల్, మాటలు: భవాని ప్రసాద్, ఫైట్స్: విజయ్.