వినోద్‌ఖన్నాకు తీవ్ర అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా ‘బ్లాడర్’ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ ‘దేవయాన్’ ‘ఖుర్బానీ’ తదితర చిత్రాలతో అశేష ప్రేక్షకాదరణ పొందిన వినోద్‌ఖన్నా - ఆ రోజుల్లో నటుడు అమితాబ్‌కి గట్టి పోటీ నిచ్చిన సంగతి తెలిసిందే. తన సినీ జీవితం నుంచీ రిటైర్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గురుదాస్‌పూర్‌కి ఎం.పి అయ్యారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థత కారణంగా ఆయనను సబర్బన్ ముంబై ఆస్పత్రిలో చేర్చించినట్టు వినోద్‌ఖన్నా కుమారుడు రాహుల్ ఖన్నా తెలియజేశారు. గత శుక్రవారం డీహైడ్రేషన్‌తో బాధపడిన ఆయనకు ‘బ్లాడర్’ కేన్సర్ ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలతోపాటు కుమారుడు రాహుల్ ఖన్నా పేర్కొన్నారు. వైద్య సేవలకు ఆయన స్పందిస్తున్నట్టు, త్వరలోనే ఆయన కోలుకోగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.