రాజవౌళి బాలీవుడ్ ఎంట్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సిరీస్‌తో దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి బాలీవుడ్ ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చింది. తాజాగా బాహుబలి ప్రమోషన్‌లో భాగంగా ఢిల్లీలో జాతీయ స్థాయి మీడియాతో మాట్లాడిన రాజవౌళి మీ బాలీవుడ్ డెబ్యూట్ ఎప్పుడు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. బాహుబలికి సంబంధించిన పనులన్నీ పూర్తవడంతోకొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నానని అన్నారు. ఆ స్క్రిప్ట్‌తోనే బాలీవుడ్‌లో సినిమా తీయాలనుకుంటున్నానని కూడా తెలిపారు. అలా రాజవౌళి ఉన్నట్టుండి బాలీవుడ్ సినిమా గురించి మాట్లాడటంతో ఆయన ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నారు. నటీనటులెవరు, ఆ చిత్రం బాహుబలికన్నా గొప్ప స్థాయిలో ఉంటుందా అనే చర్చలు మొదలయ్యాయి. వీటన్నింటికీ సరైన సమాధానం దొరకాలంటే ఏప్రిల్ 29న బాహుబలి-2 విడుదలై కొంతకాలం గడిచేవరకు ఆగాల్సిందే.