కట్స్ లేని కత్రినా కరీనా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శశాంకవౌళి, మమతారాహుల్, పావని ప్రధాన తారాగణంగా నవకళా వారి శ్రీ శ్రీమాన్ ప్రొడక్షన్స్ పతాకంపై రత్న దర్శకత్వంలో శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘కత్రినా కరీనా మధ్యలో కమల్‌హాసన్’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలకు అంతరాయం కలగగా ఢిల్లీ సెన్సార్ బోర్డుకు ప్రదర్శించారు. అక్కడ ఏ కట్స్ లేకుండా ‘ఎ’ సర్ట్ఫికెట్ లభించడంతో ఈ చిత్రాన్ని నేడు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. తెలుగు ఈ చిత్రాన్ని సెన్సార్ చేయకుండా అడ్డుకున్న తీరు చాలా బాధించిందని, దాదాపు 8 నెలలపాటు పోరాటం చేసి, ఢిల్లీనుండి క్లియరెన్స్ సెన్సార్ సర్ట్ఫికెట్ తెచ్చుకున్నామని తెలిపారు. ఉమన్స్ అసోసియేషన్ వారు ఈ సినిమా పోస్టర్ ఆపేయాలంటూ నోటీసులు పంపించారని, విడుదలవుతున్న సందర్భంలో పోస్టర్లు ఎంతో ఖర్చుపెట్టి వేయిస్తే ఆపేయమనడం ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నించారు. తమను కావాలనే ఇబ్బంది పెట్టడానికి సెన్సార్ వాళ్లు కుమ్మక్కై ఇబ్బందులు కలిగిస్తున్నారని, తమ సినిమా కంటెంట్ మీద వారికి అనుమానం ఉంటే సినిమా చూసి మాట్లాడవలసిందిగా వారు పిలుపునిచ్చారు. ఈ చిత్రంలో అమ్మాయిల గురించి పాజిటివ్‌గా చూపించామని, ఎక్కడా అశ్లీలత లేదని, ఒక అమ్మాయికి సరైన ఆలోచనా విధానం లేకపోతే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని, అంతే తప్ప అశ్లీల సన్నివేశాలు ఎక్కడా లేవని వారు వివరించారు. కార్యక్రమంలో చిత్ర దర్శకులు రత్న, శశాంక్‌వౌళి తదితరులు పాల్గొన్నారు.