గరుడవేగలో సన్నీలియోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ కథానాయకుడుగా జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ’. టఫ్ పోలీస్ అధికారిగా అంకుశం, ఆగ్రహం, మగాడు చిత్రాల తర్వాత రాజశేఖర్ ఆ రేంజ్ తరహా పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబై ఫిలిం సిటీలో జరుగుతోంది. సన్నీలియోన్ ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాటలో నటిస్తోంది. ముంబైలో వేసిన భారీ సెట్టింగ్‌లో షూటింగ్ జరుపుతున్నామని, చందమామ కథలు, గుంటూరు టాకీస్ చిత్రాల తర్వాత తాను రూపొందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయని, సన్నీలియోన్ పాటకు ఆ అంచనాలు ఇంకా పెరుగుతాయని దర్శకుడు తెలియజేశారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోందని, రాజశేఖర్ స్టయిలిష్ లుక్‌తో సరికొత్తగా కనిపిస్తాడని, ఆయనకు ఈ చిత్రం కమ్‌బ్యాక్ మూవీగా నిలుస్తుందని తెలిపారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు.