‘పెళ్లి చూపులు’కు జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ తెలుగు చిత్రం ‘పెళ్లిచూపులు’ ఉత్తమ సంభాషణల రచయిత తరుణ్ భాస్కర్
ఉత్తమ కొరియాగ్రాఫర్ రాజు సుందరం (జనతా గ్యారేజీ) ఉత్తమ ప్రజాదరణ గల చిత్రం శతమానం భవతి
జాతీయ ఉత్తమ నటీనటులు అక్షయ్, సురభి లక్ష్మి ఉత్తమ సినిమా ‘కసావ్’
ఉత్తమ దర్శకుడు రాజేష్ (వెంటిలేటర్)

64వ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్ళిచూపులు’ చిత్రం ఎంపిక కాగా, ‘రుస్తుం’ చిత్రంలో నటించిన అక్షయ్‌కుమార్ ఉత్తమ జాతీయ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా మలయాళంలో రూపొందిన ‘మిన్నామినుంగు’ చిత్రంలో నటించిన సురభిలక్ష్మి ఎంపికైంది. ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నృత్యాలు సమకూర్చిన రాజుసుందరంకు ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు ఎంపికైంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘శతమానంభవతి’ ఎంపికైంది. ఈ ఏడాది తెలుగు సినిమాల విభాగంలో నాలుగు అవార్డులు దక్కడం విశేషం. ముఖ్యంగా ‘పెళ్ళిచూపులు’ చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. ఈ చిత్రంలోని సంభాషణలకు గాను ఉత్తమ సంభాషణల రచయితగా దర్శకుడు తరుణ్‌భాస్కర్‌కు అవార్డు దక్కింది.
వివిధ విభాగాల్లో పురస్కారాలు అందుకున్న చిత్రాలు
1. ఉత్తమ హిందీ చిత్రం: నీర్జా
2. ఉత్తమ నటుడు: అక్షయ్‌కుమార్ (రుస్తుం)
3. ఉత్తమ నటి: సురభి లక్ష్మి (మిన్నామినుంగు)
4. ఉత్తమ దర్శకుడు: రాజేష్ (వెంటిలేటర్)
5. ఉత్తమ సంగీత దర్శకుడు: బాపు పద్మనాభ (అల్లమ- కన్నడ)
6. ఉత్తమ తెలుగు చిత్రం : పెళ్లిచూపులు
7. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రం: శివాయ్
8. ఉత్తమ సంభాషణలు: తరుణ్‌భాస్కర్ (పెళ్ళిచూపులు)
9. ఉత్తమ సామాజిక చిత్రం: పింక్
10. ఉత్తమ తమిళ చిత్రం: జోకర్
11. ఉత్తమ కన్నడ చిత్రం: రిజర్వేషన్
12. ఉత్తమ ప్రజాదరణ చిత్రం: శతమానం భవతి
13. ప్రత్యేక జ్యూరీ అవార్డు: మోహన్‌లాల్ (జనతా గ్యారేజ్, పులిమురుగన్)
14. ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్‌హెయిన్స్ (పులిమురుగన్)
15. ఉత్తమ మలయాళీ చిత్రం: మహేషింతే ప్రతీకారం
16. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: 24
17. ఉత్తమ నూతన దర్శకుడు: దీప్‌చౌదరి (అలీఫా)
18. ఉత్తమ బాలల చిత్రం: ధనక్ (హిందీ)
19. ఉత్తమ బాల నటుడు: ఆదీష్ ప్రవీణ్ (కుంజుదైవమ్), సాజ్ (నూర్ ఇస్లామ్), మనోహర్ (రైల్వే చిల్డ్రన్)
20. ఉత్తమ నేపథ్య గాయకుడు: సుందర అయ్యర్ (జోకర్)
21. ఉత్తమ నేపథ్య గాయని: తుమిజాకీ
22. ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): శ్యామ్‌పుష్కరన్ (మహేషంతీ ప్రతీకారం)
23. ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఎడాప్టడ్): సంజ్ కిషన్‌జీ పటేల్ (దశక్రియ)
24. ఉత్తమ ఎడిటింగ్: రామేశ్వర్ (వెంటిలేటర్)
25. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్: నవీన్‌పాల్ (శివాయ్)
26. ఉత్తమ నృత్య దర్శకుడు: రాజు సుందరం (జనతాగ్యారేజ్)
27. ఉత్తమ సౌండ్ డిజైనర్: జయదేవన్ (కాడుపోకున్నానీరం)
28. ఉత్తమ ఛాయాగ్రహణం: ఎస్.తిరునావుకరసు (24 తమిళ్)
29. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: సచిన్ లోవాల్కర్ (సైకిల్- మరాఠా)
30. ఉత్తమ అలంకరణ: ఎంకె రామకృష్ణ (అల్లమ- కన్నడ)
31. ఉత్తమ సహాయ నటి: జహీరా వాసిం (దంగల్)