ఫైట్స్ చేస్తున్న అఖిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున ఎలాంటి ముందస్తు వార్త లేకుండా అఖిల్ రెండవ చిత్రాన్ని ప్రారంభించి అందరికీ ఆశ్చర్యాన్నిచ్చాడు. చాలా రోజుల తరువాత అఖిల్ రెండవ సినిమా మొదలవ్వడంతో అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ నెల 4 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. దర్శకుడు విక్రమ్ కుమార్ అఖిల్‌పై కొన్ని కీలకమైన ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగియనుంది. నాగార్జునే స్వయంగా సెట్స్‌కు వెళ్లి మరీ షూటింగ్ ఎలా జరుగుతుందో గమనిస్తున్నారు. మొదటి సినిమా ఫెయిల్యూర్ అయిన నేపథ్యంలో ఈ చిత్రం హిట్ అవ్వాలని, కాస్త ఆలస్యమైనా మంచి దర్శకుడిని, కథని ఎంచుకున్నారని తెలుస్తోంది. నాగార్జునకు శివ ఎంత పేరు తెచ్చిందో, ఆ స్థాయిలో ఈ చిత్రం ఉండేలా రూపొందిస్తున్నారు. హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ వుందో తారక’ అనే పేరు పరిశీలనలో వుంది.