బాహుబలికన్నా గొప్పగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ చిత్రం ఎంత ప్రజాదరణ పొందిందో తెలిసిందే. మనం ఏదన్నా సినిమా తీయాలి అంటే అంతకన్నా బాగా తీయగలగాలి అంటున్నారు బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్. ప్రస్తుతం ఆయన మనసులో మహాభారతం లాంటి గొప్ప సినిమా తీయాలన్న కోరిక మెదులుతోందట. ఈ విషయాన్ని ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు. మహాభారతాన్ని సినిమా తీయాలని తనకొక కల వున్నదని, ఈ సినిమా తీయాలనుకుంటే మాత్రం భారీ బడ్జెట్‌తో రూపొందించాలని చెబుతున్నారు. అయితే, అంత భారీ బడ్జెట్ పెట్టడానికి తన వద్ద సరిపడా నగదు లేదని, కుదిరితే సల్మాన్, కరణ్‌తో కలిసి ఓ సినిమా రూపొందించడానికి తప్పక సహకరిస్తారని ఆయన తెలిపారు. మహాభారతం చిత్రాన్ని సినిమాగా తీస్తే అది అంతర్జాతీయ మార్కెట్‌లలోనూ వసూళ్లు రాబట్టే విధంగా రూపొందించాలని, అలా జరగాలంటే ఇంటర్నేషనల్ ప్రొడ్యూసర్ దొరకాలని అన్నారు. అలా షారుక్‌ఖాన్ తన మనసులోని మాటను తెలిపారు. అమీర్‌ఖాన్ కూడా ఓ ఆధ్యాత్మిక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. వీలైతే అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లు కలిసి మహాభారతం చిత్రాన్ని రూపొందిస్తే మరీ బాగుంటుందని బాలీవుడ్ మీడియా వ్యాఖ్యానిస్తోంది.