నవ్వించడంలో బాబు బిజీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియా ఐసోల, శ్రీముఖి హీరోయిన్లుగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం 3బాబు బాగా బిజీ2. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా వివరాలు తెలియజేస్తూ- రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అవసరాల శ్రీనివాస్ చేసిన చిత్రాలన్నింటిలో చాలా భిన్నంగా వుండే సినిమా ఇది. సినిమా మొత్తం నవ్విస్తూ సాగుతుంది. ఇందులో నలుగురు హీరోయిన్లు భిన్నమైన పాత్రల్లో కన్పిస్తారు. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి 3ఎ2 సర్ట్ఫికెట్ లభించింది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి మేలో విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, కెమెరా: సురేష్ భార్గవ, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాత: అభిషేక్ నామా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్ మేడారం.