అదే మార్గంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏసుక్రీస్తు జీవిత చరిత్రని కొత్త అంశాలతో వైవిధ్యంగా తెరకెక్కిస్తున్న చిత్రం -లోకరక్షకుడు. బ్రహ్మం సిహెచ్ దర్శకత్వంలో చండ్రస్ ఆర్ట్ మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ చండ్ర రూపొందిస్తున్న చిత్రమిది. ఇప్పటికే లండన్ పార్లమెంట్‌లో లోగోను విడుదల చేసిన చిత్ర బృందం, ఇంగ్లాండ్‌లోని పలు లొకేషన్లలో రెండో షెడ్యూల్ పూర్తి చేసి ప్రేక్షకులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత చంద్రశేఖర్ వెల్లడించారు. శాంతికి చిహ్నంగా భారతదేశాన్ని ప్రపంచపటంలో చూపవచ్చంటూ, శాంతి సందేశం అందించిన ఏసుక్రీస్తు జీవిత ఘట్టాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. క్రీస్తు జీవిత చరిత్రపై ఇదో మంచి సినిమాగా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం తమకు ఉందని దర్శకుడు బ్రహ్మం తెలిపారు. చిత్రానికి సంగీతం ఎకె రిసాల్‌సాయి, కెమెరా జి క్రిష్ అందిస్తున్నారు.