టీజర్‌లో గ్రీన్‌కార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహ ప్రొడక్షన్స్ పతాకంపై శత్రుఘ్న రాయపాటి, స్ట్ఫోనీ, జోసలిన్ ముఖ్య తారాగణంగా రమ్స్ (యుఎస్‌ఎ) దర్శకత్వంలో శ్రీనివాసగుప్త, మోహన్.ఆర్, నరసింహ, నాగశ్రీనివాసరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 3గ్రీన్‌కార్డ్2. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు చలపతిరావు మాట్లాడుతూ- సినిమా మొత్తం అమెరికాలో జరిగింది. వియ్ లవ్ అమెరికా, వియ్ మెట్ గన్స్ అనే కానె్సప్టు ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. అమెరికాలో ఎవరి స్వేచ్ఛ వారికుంటుంది. ఎవరిని ఎవ్వడు కాల్చినా అడిగేవాడుండడు. డబ్బు సంపాదన కోసం మనవాళ్ళు అమెరికాకి వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు బాగాలేవు. ఆద్యంతం వినోదాత్మకంగా ఆసక్తికర కథాంశంతో ప్రస్తుత పరిస్థితులను తెలియజెప్పేలా ఈ చిత్రాన్ని నిర్మించాము అన్నారు. చిత్ర దర్శకుడు రమ్స్ మాట్లాడుతూ- వీసా తీసుకొని అమెరికా చేరుకున్న ఓ కుర్రాడి కథే ఇది. గత 15 సంవత్సరాలుగా నేను అమెరికాలో గమనించిన పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ కథను రెడీ చేశాను. అమెరికాకు పంపాలనే తల్లిదండ్రులకు ఈ సినిమా అంకితం. 2004లో పది డాలర్ల బీరు కోసమే ఒక వ్యక్తి నామీద గన్ ఎక్కుపెట్టాడు. ఇలాంటివి చాలా అంశాలు ఇందులో వుంటాయి. ఇండియా, అమెరికా నటులతో తెరకెక్కించిన చిత్రమిది. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం. తర్వాత చిత్రాన్ని వీలైనంత ఎక్కువ థియేటర్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ- మంచి కథ, కథనాలతో రమ్స్ తెరకెక్కించిన చిత్రమిది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:కు (యుఎస్‌ఎ), హెన్నీ ప్రిన్స్, ప్రణయకుమార్, కెమెరా:నవీన్, నాగశ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్:మోహన్, రామారావు, దర్శకత్వం:రమ్స్.