భిన్నమైన పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్లు గ్లామర్‌కే పరిమితం కాకుండా ఉనికి చాటుకునే పాత్రల్లో కనిపించేందుకూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలంటే ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటున్నారు. నయనతార, సమంతలాంటి హీరోయిన్లు వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రయోగాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో గ్లామర్ భామ తమన్నా అలాంటి వైవిధ్యమైన పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు గ్లామర్ హీరోయిన్‌గా సౌత్‌లో క్రేజ్ తెచ్చుకున్న తమ్మూ, తాజాగా ప్రయోగాత్మక చిత్రానికి ఓకే చెప్పింది. అదీ ప్రయోగాలకు పెట్టింది పేరైన బాలీవుడ్‌లో. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వసు భగ్నాని బ్యానర్‌లో రూపొందే చిత్రంలో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా కనిపించనుందట. ఈ తరహా ప్రయోగం చేయడం తమన్నా కెరీర్‌లో మొదటిసారి. ఇప్పటికే స్క్రిప్ట్ పూరె్తైన ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం బాహుబలి చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న తమ్మూ బేబీ, ఆ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మొత్తానికి నటిగా తన ఉనికి చాటుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తోంది.