భక్తితో పిలిస్తే పలుకుతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాస్ బోని, పార్వతీనాయుడు సంయుక్తంగా రూపొందించిన పిలిచినా పలుకుతా పాటల సీడీ విడుదలైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నటుడు మురళీమోహన్ బిగ్ సిడిని, ఆడియో సీడీని విడుదల చేశారు. సాయిశ్రేయ పతాకంపై సాయిబాబాపై స్వర్ణ సుందర్ రచించిన పాటలను జిఆర్ నరేన్ సంగీత సారథ్యంలో రూపొందించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ సాయినాధునిపై ఏ పాట విన్నా బాగా ఉంటుందని, ఈ సీడీలో అందరకు నచ్చే పాటలు ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని మంచి ఆడియోలు సంస్థ అందించాలని కోరారు. పార్వతీనాయుడు, శ్రీనివాస్ బోని చేసిన ప్రయత్నం మంచి సాహిత్యంతో, మంచి పాటలు రావడానికి కారణమైందన్నారు. దేవుడిపై భక్తిని ఇలా ప్రదర్శించిన నిర్మాతలకు మంచి భవిష్యత్ ఉంటుందని అనిల్ చంద్ర అన్నారు. కార్యక్రమంలో శివాజీ రాజా, పార్వతీనాయుడు, నరేన్, రేలంగి నరసింహారావు, జయంతిరెడ్డి, సుధాన్ష్ తదితరులు పాల్గొన్నారు.