మరో మెగా హీరోతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ లావణ్య త్రిపాఠి లేటెస్టుగా మిస్టర్ సినిమాతో మెగా హీరో వరుణ్ సరసన నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ జోరుమీదున్న ఈ అందగత్తె, తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఇప్పటికే నాగచైతన్య సరసన ‘రారండోయ్.. వేడుక చూద్దాం’లో నటిస్తున్న లావణ్య మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పింది. అయితే, ఆ తరువాతి చిత్రం కూడా మెగా హీరోదే కావడం విశేషం. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ సరసన ‘జవాన్’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా తేజ దర్శకత్వంలో మరో సినిమా, అలాగే వినాయక్ నేతృత్వంలో మరో సినిమా కూడా వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న చిత్రంలో లావణ్య నటించడానికి ఓకె చెప్పింది. వరుసగా మెగా హీరోలతో జోడీకట్టేందుకు సిద్ధమైంది.