ఫాంటసీ ఏంజెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై నాగఅనే్వష్, హెబ్బాపటేల్ జంటగా పళని దర్శకత్వంలో సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ హైదరాబాద్‌లో దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ఈ సినిమా రొటీన్‌గా లేకుండా వైవిధ్యమైన కథ కథనాలతో సాగుతుందని, హీరో లుక్స్, గెటప్స్ సరికొత్తగా వుంటాయని, క్లైమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్స్ సినిమాకు హైలెట్‌గా వుంటాయని తెలిపారు. ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్‌గా సాగుతుందని, బ్లాక్‌బస్టర్ అవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఇందులో తాను, సప్తగిరి చేసిన కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయని హీరో నాగఅనే్వష్ తెలిపారు. రీరికార్డింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో పాటలన్నీ బాగా వచ్చాయని సంగీత దర్శకుడు భీమ్స్ సిసీరిలియో తెలిపారు. కార్యక్రమంలో సప్తగిరి, భువనసాగర్, హెబ్బాపటేల్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.