శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయత్రి ప్రొడక్షన్స్ పతాకంపై నరేష్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో సి.కల్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- పేరులోనే వైవిధ్యం కన్పిస్తోందని, నరేష్ అందించిన సంగీ తం బాగుందని తెలిపారు. చిత్రానికి సంబంధించిన కథ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా వుంటుందని, గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషన్ చిత్రమని, మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత కె.ఎన్.రావు తెలిపారు. ఒక గ్రామానికి వెళ్లి పది రోజులు అక్కడ వుండి వస్తే ఎలా వుంటుందో ఈ సినిమా అలా వుంటుందని దర్శకుడు నరేష్ అన్నారు. కార్యక్రమంలో హీరో శేఖర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. దీప్తిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గీతాంజలి, రామరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:కూనపరెడ్డి జయకృష్ణ, ఎడిటింగ్:సుంకర ఎస్.ఎస్. పాటలు:సాహిత్య సాగర్, గిరి, నిర్మాత:కె.ఎల్.రావు, రచన, సంగీతం, దర్శకత్వం:నరేష్ పెంట.