పాటకడుతున్న గద్దర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్దర్.. తెలంగాణ పోరాటంలో తన పాటతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన ప్రజా గాయకుడు. ఆయన పాటలంటే ఇష్టపడనివారుండరు. విప్లవ నేతగా ఖ్యాతి తెచ్చుకున్న గద్దర్ అడపాదడపా సినిమాలకు పాటలు రాస్తున్న విషయం తెలిసిందే. ‘బండెనకబండిగట్టి/ పదహారు బండ్లుగట్టి’ పాట పాపులార్టీని ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈమధ్యే ‘జై బోలో తెలంగాణ’ సినిమా కోసం ‘పొడుస్తున్న పొద్దు మీద’ అనే పాటతో మరో సంచలనం సృష్టించాడు. అలాంటి గద్దర్ మరోసారి తెలుగు సినిమాకు పాట అందించనున్నాడు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ చాలారోజుల తరువాత తెరకెక్కిస్తున్న సినిమాకోసం ఆయన గద్దర్‌తో ఓ పాట రాయించాలని చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా తరువాత చంద్ర సిద్ధార్థ్ రూపొందిస్తున్న ఈ సినిమాను కన్నడ ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది నెగటివ్ పాత్రలు పోషిస్తారట! మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.