చాలా భయపడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ చిత్రంలో నీలాంబరిని మర్చిపోలేం. దాదాపు మూడు దశాబ్దాలుగా సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న రమ్యకృష్ణను ఒక రేంజ్‌కు తీసుకెళ్లిన పాత్ర అది. నీలాంబరిని మరిపించే పాత్రనూ మళ్లీ రమ్యకృష్ణే చేసింది. అది బాహుబలిలో శివగామి పాత్ర. ఆ క్యారెక్టర్‌కు ఆమే కరెక్టని జక్కన్న పెట్టుకున్న నమ్మకాన్ని నూరుశాతం నిజం చేసింది. అయితే, ఆ పాత్ర చేయడానికి హోంవర్క్ చేయలేదుగానీ, చాలా సందర్భాల్లో భయపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మాహిష్మతి సామ్రాజ్ఞి శివగామి. ‘శివగామి పాత్ర కోసం హోంవర్క్ చేయలేదు. కాకపోతే, బిగినింగ్ సీన్ చేయడానికి టెన్షన్ పడ్డాను. ఆ సీన్ చేయడానికి కేరళలోని చల్లకుడి జలపాతం వద్దకు చేరినపుడు ప్రవాహ ఉధృతి చూసి భయంవేసింది. నీళ్లలో మునిగి ఉండే సన్నివేశం తీస్తున్నపుడు ప్రవాహ వేగానికి అటూ ఇటూ కదిలిపోయేదాన్ని. కొట్టుకుపోవడం ఖాయమన్నంత భయం వేసింది. ‘నువ్వు చేస్తున్నది శివగామి పాత్ర. ఆమె ముఖంలో భయం కనిపించదు’ అంటూ రాజవౌళి చేసిన హెచ్చరిక ఔషధంలా పని చేసింది. అంతే, సన్నివేశాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేశాం. నిజానికి దర్శకుడు రాజవౌళి చెప్పిందే చేశాను తప్ప, ఆ పాత్రను పెద్దగా నేనేమీ ఊహించుకోలేదు. ఇప్పుడు శివగామి పాత్రలో నన్ను తప్ప మరెవరినీ ఊహించుకోలేనేమో. ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేం’ అంటూ చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ.