కొత్త హీరోలైనా ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ రెజీనాకు ఈమధ్య అవకాశాలు బాగా తగ్గాయి. దానికి కారణం ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో కొత్త అవకాశాలు రావడంలేదు. గ్లామర్ ఆరబోతలో ఏమాత్రం అరమరికల్లేకున్నా, ఎందుకో రెజీనాకు టైం కలిసిరావట్లేదు. రవితేజ, సాయిధరమ్‌తేజ్ లాంటి హీరోల సరసన నటించిందన్న రికార్డే తప్ప, స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం అవకాశాలు పట్టలేకపోతోంది. ప్రస్తుతం కృష్ణవంశీ రూపొందిస్తున్న నక్షత్రంలో నటిస్తున్న రెజీనా, ఇప్పుడు కొత్త హీరోల సరసన నటించేందుకూ ఓకె చెప్పడం విశేషం! ఇప్పటికే కోలీవుడ్‌లో రెండు సినిమాలకు ఓకె చెప్పింది. అందులో ఒక సినిమాలో కొత్త హీరో కావడం విశేషం. ఈ విషయంపై రెజీ స్పందిస్తూ -కొత్త హీరోలతో ఇబ్బందేం లేదు. నా పాత్ర బావుంటే, కొత్తవాళ్లతోనైనా చేయడానికి రెడీ’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసిందట. అవకాశాలు తగ్గినపుడు, ఉన్నవాటిని వినియోగించుకోవడం తెలివైనవాళ్ల పని. టైం బాగోకపోయినా టైమింగ్‌తో నెట్టుకురావడం అంటే ఇదే.