మాస్ బుల్లెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్ కథానాయకుడిగా జయబాలాజీ రియల్ మీడియా పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రం మాస్‌ను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు యూత్, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, పేరుకి మంచి అప్లాజ్ వచ్చిందని తెలిపారు. గోపీచంద్ కెరీర్‌లో ఓ వైవిధ్యమైన సినిమాగా ‘ఆరడుగుల బుల్లెట్’ నిలుస్తుందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేశామని, వచ్చే నెల వేసవి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, అభిమన్యుసింగ్, చలపతిరావు, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్‌రెడ్డి, ఫిరోజ్ అబ్బాసీ, రమాప్రభ, సురేఖావాణి, సన, మధునందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:మణిశర్మ, కెమెరా:బాలమురుగన్, దర్శకత్వం:బి.గోపాల్.