గరుడవేగంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ పోలీసు అధికారిగా గరుడవేగతో మరోసారి తన స్టైల్లో ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో రూపొందిస్తున్న చిత్రానికి నిర్మాత కోటేశ్వరరాజు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తాజాగా శృంగారతార సన్నీలియోన్‌పై చిత్రీకరించిన పాట పూర్తయ్యింది. కొద్దిపాటి ప్యాచ్ వర్క్ వినా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని నిర్మాత కోటేశ్వర రావు పేర్కొన్నారు. ‘అంకుశం, ఆగ్రహం, మగాడువంటి చిత్రాల్లో పోలీసు అధికారిగా యాంగ్రీ యంగ్‌మెన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న తీరు తెలిసిందే. ఈ చిత్రంలోనూ రాజశేఖర్ మరోసారి పోలీస్ అధికారిగా విశ్వరూపం చూపించనున్నారు. ముంబై ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో సన్నీలియోన్ పాట చిత్రీకరించాం’ అని తెలిపారు. 50మంది డాన్సర్లతో మూడు రోజులపాటు పాటను షూట్ చేశామని, డిఫరెంట్ కథనాలతో సినిమాలు రూపొందించే ప్రవీణ్ సత్తార్ ఈ చిత్రంలో రాజశేఖర్‌ను సరికొత్తగా చూపనున్నారని వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, అంచనాలను మించి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. పూజాకుమార్ కథానాయికగా నటిస్తున్న చిత్రంలో అరుణ్ అతిథి, కిశోర్, రవివర్మ, చరణ్‌దీప్, నాజర్, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చిత్రానికి కెమెరా అంజి, సంగీతం శ్రీచరణ్, దర్శకత్వం ప్రవీణ్ సత్తారు.